గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 17: దామనపల్లి పంచాయతీ ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పిస్తే అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తానని కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కూడా పద్మ తెలిపారు. దశాబ్దాలుగా ఒకే వ్యక్తికి పదవులు కట్టబెట్టడం వల్ల పంచాయతీ అభివృద్ధి కుంటుపడిందని, పలు గ్రామాల్లో నేటికీ సీసీ రోడ్లు కూడా లేవని విమర్శించారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై ప్రజలు ప్రశ్నించాలని, ఎన్నికల హామీలకు ప్రభావితం కాకుండా అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే పారదర్శక పాలనతో పంచాయతీ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.

