Homeతెలంగాణహైదరాబాద్నాచారం సర్కిల్‌లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు

నాచారం సర్కిల్‌లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు

నాచారం సర్కిల్‌లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు

అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టేదీ..?

నోటీసులకే టౌన్ ప్లానింగ్ పరిమితమా

రాఘవేంద్ర నగర్ లో సెట్‌బ్యాక్స్ లేకుండా భారీ బహుళ అంతస్తుల నిర్మాణం

దుర్గానగర్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం: పొన్నాల రాజు

కాప్రా, పెన్ పవర్ నవంబర్ 22:

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. భవన నిర్మాణ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొల్ల ముత్యాల బావి సమీపంలోని రాఘవేంద్ర నగర్‌లో కొనసాగుతున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణం ఇందుకు నిదర్శనంగా స్థానికులు ప్రస్తావిస్తున్నారు. భవనం చుట్టూ నిబంధనల ప్రకారం వదలాల్సిన సెట్‌బ్యాక్స్ ఉన్నాయా? నిర్మాణానికి సంబంధిత శాఖ అనుమతులు ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిర్మాణ స్థలంలో పనులు వేగంగా కొనసాగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే సమయంలో నిబంధనలు పరిశీలించాల్సిన అధికారులు, నిర్మాణం జరుగుతున్న సమయంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత కూడా కలిగి ఉన్నారు. అయితే నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు నోటీసులు జారీ చేయడంతోనే సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నోటీసులు ఇస్తే సరిపోతుందా?

నిర్మాణ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులు చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం నోటీసులు జారీ చేసి నిర్మాణ పనులు కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసుల అనంతరం నిర్మాణ పనులు నిలిపివేశారా? అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఏసీపీ వివరణ కోసం ఎదురుచూపులు

రాఘవేంద్ర నగర్‌లో జరుగుతున్న ఈ నిర్మాణ వ్యవహారంపై టౌన్ ప్లానింగ్ ఏసీపీని పలుమార్లు వివరణ కోరినప్పటికీ స్పందన రాకపోవడం గమనార్హం. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, సెట్‌బ్యాక్స్ నిబంధనలు, ఇప్పటివరకు జారీ చేసిన నోటీసులు, తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. అధికారుల మౌనం కారణంగా ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఉన్నతాధికారులు స్పందించాలి: బి.ఆర్.ఎస్ నేత పొన్నాల రాజు

నాచారం సర్కిల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బి ఆర్ ఎస్ నాయకుడు పొన్నలా రాజు గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదని అన్నారు
రాఘవేంద్ర నగర్ నిర్మాణం, దుర్గానగర్ బఫర్ జోన్ బాయి బొందలో చేపడుతున్న అక్రమ నిర్మాణం లిఫ్ట్ ఏర్పాటు పై ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అనుమతి పత్రాలు, నిర్మాణ ప్లాన్, వాస్తవ నిర్మాణ పరిస్థితులను పరిశీలించాలని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular