బాల్యానికి భరోసా..ఆరోగ్యానికి రక్ష పల్స్ పోలియో: కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ
శక్తి సాయి నగర్ కాలనీ కమిటీ హాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు
కాప్రా,పెన్ పవర్ నవంబర్ 22:
చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని శక్తి సాయి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం శక్తి సాయి నగర్ కాలనీ కమిటీ హాల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, మనోహర్, విజయ రెడ్డి, రాంప్రసాద్ సింగ్, రవీందర్, సతీష్, నదీమ్, నరేష్ గౌడ్, యాకూబ్ పాషా, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

