గూడెంకొత్తవీధి, పెన్ పవర్,నవంబర్ 23:వంచుల పంచాయతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముర్ల భూపతి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే పంచాయతీలోని సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
పంచాయతీ గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ముర్ల భూపతి
RELATED ARTICLES

