ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పశ్చిమ గోదావరిక్రీడలకు వయస్సు హోదాతో సంబంధం లేదు-శాప్ డైరెక్టర్ జగదీశ్వరి

క్రీడలకు వయస్సు హోదాతో సంబంధం లేదు-శాప్ డైరెక్టర్ జగదీశ్వరి

Sports have nothing to do with age status - Shaap Director Jagadeeswari

ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన క్రీడోత్సవం

స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం

14 రకాల క్రీడల్లో పాల్గొంటున్న 154 మంది సభ్యులు

క్రికెట్, టగ్ ఆఫ్ వార్, త్రో బాల్ పోటీలకు ప్రత్యేక ఆకర్షణ

ప్రజాప్రతినిధుల్లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరింపు

పోలవరం,పెన్ పవర్ ఫిబ్రవరి 24

క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర క్రీడ ప్రాధికారిత సంస్థ నిర్వాహకురాలు కొవ్వాసు జగదీశ్వరి అన్నారు.విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శాసనసభ,శాసనమండలి సభ్యులకు జరుగుతున్న ఆటల పోటీలను శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తో కలిసి ప్రారంభించారు.మూడు రోజులపాటు జరగనున్న ఈ పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులకు 14 రకాల ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు.ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 154 మంది సభ్యులు పాల్గొంటారన్నారు.క్రికెట్ పోటీలో ఆరు జట్లు తలపడనున్నాయన్నారు.టగ్ ఆఫ్ వార్ లో ఉన్న రెండు చెట్లకు సభాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు లు నాయకత్వం వహించనున్నారు.త్రో బాల్ జట్టుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత సారథ్యం వహిస్తారన్నారు.అధ్యంతం ఎంతో ఉత్సాహపరితంగా సాగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన శాసనసభ,శాసనమండలి సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటలు ఆడడం వలన కలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారని జగదీశ్వరి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular