- గూడెం కొత్తవీధి జనసైనికుల్లో హర్షాతిరేకం
గూడెం కొత్త వీధి, పెన్ పవర్,జూన్ 4: జనసేన పార్టీ రాష్ట్ర సేనదళం కమిటీలో పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. వంపూరు గంగులయ్యకు బాధ్యతలు అప్పగించడంపై జీకే వీధి మండల జనసేన నాయకులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ, పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న డా. గంగులయ్యకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించడం జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్‌గా, పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా డాక్టర్ గంగులయ్య ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర సేనదళం కమిటీలో ఆయనకు స్థానం కల్పించడం ద్వారా పాడేరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ వంపూరు గంగులయ్యకు బాధ్యతలు అప్పగించినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గంగులయ్య మార్గదర్శకత్వంలో పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు సంకల్పం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గొర్లె వీరవెంకట్, వాసుపరి ప్రసాద్, పొత్తూరు విష్ణుమూర్తి, కొయ్యం ఇమ్మానుయేల్, గడుతూరి పరమేశ్వరరావు, విరోజీ త్రిమూర్తులు, నాడేల సత్యారావు, ఉల్లం ఈశ్వరరావు, గబులంగి గణేష్,వంశీ, పాంగి శ్రీను, సాగిన బ్రహ్మాజీ, పాల్స్, కోటి, నాగేంద్ర, రేణుక, ఉమాదేవి, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

