గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 1:
పోలవరం జిల్లా ఏజెన్సీ పరిధిలోని రంపచోడవరం మండలం పోక్స్‌పేట పంచాయతీ నరసాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన, వారి కుటుంబ సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి అందుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అక్కడికక్కడే తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారులకు సూచించి పరిష్కార చర్యలు చేపట్టారు.పార్టీ యంత్రాంగం మరియు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, తదుపరి నెలలోపు చిన్నపాటి సమస్యలన్నీ పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, పోక్స్‌పేట ఉప సర్పంచ్ కారం సురేష్ బాబు, వార్డు సభ్యులు బాపనమ్మ, బుల్లమ్మ, పెంటమ్మ, సారపు చిట్టబ్బాయి, వెంకటేశ్వర్లు, శివ, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

