ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ బోజ్జి రెడ్డి ప్రశంసలు
గంగవరం పెన్ పవర్ జూలై 12
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆ వృత్తిలో నాలుగు దశాబ్దాల పాటు విశేష సేవలు అందించిన కారం లక్షణ వరప్రసాద్ (కేఎల్‌వీ ప్రసాద్) సేవలు అభినందనీయమని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బోజ్జి రెడ్డి అన్నారు.
గంగవరం మండలం జగ్గంపాలెం గ్రామానికి చెందిన కేఎల్‌వీ ప్రసాద్ గత నెల 30న ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా గ్రామస్తులు, ఉద్యోగుల సంఘాల సభ్యులు సంయుక్తంగా ఘన పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చోళ బుజ్జి రెడ్డి, కేఎల్‌వీ ప్రసాద్ దంపతులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు మాట్లాడుతూ, కేఎల్‌వీ ప్రసాద్ ఉపాధ్యాయులకు మార్గదర్శిగా నిలిచారని, ఉపాధ్యాయుడిగా, రిసోర్స్ పర్సన్‌గా, సీఎంవోగా పలు బాధ్యతలు నిర్వహిస్తూ విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.
రాజవొమ్మంగి ఎంఈవో సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రసాద్ మాస్టార్‌ను యువ ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుడు కారం రంగారావు మాట్లాడుతూ, కేఎల్‌వీ ప్రసాద్ యువతకు, ఉపాధ్యాయులకు ఆదర్శ నాయకుడని, జగ్గంపాలెం గ్రామ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.
పోలవరం జిల్లా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. కృష్ణ మాట్లాడుతూ, కేఎల్‌వీ ప్రసాద్ కేవలం ఉపాధ్యాయుడే కాకుండా జూనియర్ ఉపాధ్యాయులకు మార్గదర్శి అని, బడి బయట ఉన్న పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంలో విశేష కృషి చేశారని, ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వ్యాప్తికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు రాంబాబు దొర, మండల అధ్యక్షులు కారం బొజ్జిదొర, సర్వ శిక్ష అభియాన్ ఏపీవో తీగల బొజ్జయ్య, ఆదివాసి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కంగల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రంగబాబు, రామకృష్ణ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు దైవప్రసాద్, శేఖర్‌బాబు, ఆర్గనైజర్లు పి. బాపిరాజు దొర, కె. బాపిరాజు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది, పీఎంఆర్సీ సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

