ePaper
Saturday, April 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఒంగోలు గిత్తల పోషకులకు ప్రభుత్వ సహయ, సహకారాలు అవసరం : ప్రత్తిపాటి

ఒంగోలు గిత్తల పోషకులకు ప్రభుత్వ సహయ, సహకారాలు అవసరం : ప్రత్తిపాటి

  • రైతాంగం ఎడ్లపై మక్కువతోనే, వ్యయ ప్రయాసలున్నా, వాటిని పోషిస్తోంది.
  • చంద్రబాబు ప్రోత్సాహం వల్లే ఎడ్ల బలప్రదర్శన పోటీల అడ్డంకులు తొలగిపోయాయి.
  • ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ నేత్రత్వంలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో ప్రత్తిపాటి.

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03: 

చిలకలూరిపేట : రాష్ట్రంలో కొందరు ప్రముఖులు నిర్వహించే జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో, ఏటా తెనాలిలో మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో జరిగే పోటీలకు ప్రత్యేక స్థానముందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో, ఆలపాటి శివరామ కృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో, తెనాలి..వేమూరు నియోజకవర్గాల భాగస్వామ్యంతో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలకు శుక్రవారం సాయంత్రం ప్రత్తిపాటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్ల యజమానులు, రైతులు, పోటీల నిర్వాహకుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఎడ్ల బలప్రదర్శన పోటీలను తిరిగి నిర్వహించుకుంటున్నాం

ఒంగోలు గిత్తల పోషణ ఎంతో వ్యయప్రయాసలతో కూడిందని, ఎన్ని ఇబ్బందులున్నా లెక్కచేయకుండా వృషభ రాజాలపై ఉన్న మక్కువ, అభిమానంతో వాటిని పెంచి పోషిస్తున్న రైతులను ఎంత అభినందించినా తక్కువేనన్నారు. పేరు ప్రతిష్ఠల కోసం ఎడ్లను పెంచడం సామాన్య విషయం కాదన్నారు. ఎడ్లపోషకులకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేందుకు ఇటువంటి పందేలు ఎంతగానో దోహదపడతాయని ప్రత్తిపాటి తెలిపారు. కూటమిప్రభుత్వం ఈ తరహా ఎడ్ల పందేలను, పశుపోషణను ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే, గతంలో కొందరి స్వార్థంతో నిలిచిపోయిన ఎడ్ల బలప్రదర్శన పోటీలను, తిరిగి నిర్వహించుకుంటున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. తాను వ్యవసాయమంత్రిగా ఉన్న సమయంలోనే అన్ని అడ్డంకులు అధిగమించి పోటీలను పునరుద్ధరించడం జరిగిందన్నారు.

జనవరిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతినాడు ప్రారంభించి, యువనేత, మంత్రి నారాలోకేశ్ జన్మదినం వరకు చిలకలూరిపేటలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు భారీస్థాయిలో నిర్వహించినట్టు ప్రత్తిపాటి చెప్పారు.

ప్రభుత్వాలు సహకరిస్తే ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల నిర్వాహకులకు కొంత ఊరటగా ఉంటుందని, సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి, ఎడ్ల పోషకులకు సహాయసహకారాలు అందించేలా తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో మున్ముందు మరిన్ని ఎడ్ల బలప్రదర్శన పోటీలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, డేగల ప్రభాకర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకట రెడ్డి , రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు ఉదయ్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular