ePaper
Saturday, April 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిస్పీకర్ అయ్యన్న పై చర్యలు తీసుకోవాలి

స్పీకర్ అయ్యన్న పై చర్యలు తీసుకోవాలి

నర్సీపట్నంలో దళిత డప్పు కళాకారుడిపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా కలకలం రేపింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ దళిత గౌరవంపై దాడిగా ఈ ఘటనను అభివర్ణించారు.వీడియో వైరల్ అయినా పోలీసులు స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

  • దళిత కళాకారుడిపై దాడి ఘటనతో నర్సీపట్నంలో ఉద్రిక్తత
  • స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఫైర్
  • అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నిరసన కార్యక్రమం
  • డప్పు కళాకారుడు దాసుపై చేయి చేసుకోవడం దారుణం
  • వైరల్ వీడియోపై పోలీసుల మౌనం ప్రశ్నార్థకం
  • స్పీకర్‌కు చట్టాలు వర్తించవా అంటూ గణేష్ ప్రశ్న
  • బాధితుడితో బలవంతపు ప్రకటన చేయించారనే ఆరోపణలు
  • దళిత గౌరవాన్ని అవమానించిన ఘటనగా వైసీపీ విమర్శలు
  • అయ్యన్నపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్
  • దళిత హక్కుల పరిరక్షణకు కఠిన చర్యలపై ఒత్తిడి

స్టేట్ పొలిటికల్ బ్యూరో | పెన్ పవర్ | విజయవాడ | ఏప్రిల్ 03

నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతరలో డప్పు కళాకారుడు దాసు అనే దళిత వ్యక్తిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నిరసన కార్యక్రమం చేపట్టారు. అబీద్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వయసులో పెద్దవాడైన డప్పు కళాకారుడు దాసుపై అయ్యన్నపాత్రుడు చేయి చేసుకోవడం దారుణమన్నారు. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అయ్యన్నపాత్రుడు స్పీకర్ అయినంత మాత్రాన చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్నప్పటికీ, దెబ్బతిన్న వ్యక్తితో బలవంతంగా తానే తప్పు చేసినట్లు చెప్పించారన్నారు. దళిత కళాకారుడు పై చేయి చేసుకున్న స్పీకర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని గణేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైసీపీ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, దళిత వైసీపీ నేతలు గజ్జలపు మణికుమారి, లోచల సుజాత, షేక్ రోజా, అల్లంపల్లి లావణ్య, అల్లంపల్లి ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular