Homeఆంధ్రప్రదేశ్పోలవరంపాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ

 

ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు

గంగవరం పెన్ పవర్ జూలై 4

మండలంలోని పలు పాఠశాలలను ఏజెన్సీ విద్యాశాఖ అధికారి వై మల్లేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు ఖచ్చితం గా హాజరు కావాలన్నారు.

ఓజు వంద మండల పరిషత్ పాఠశాలో 11 మంది విద్యార్థులకు ఎనిమిది మంది విద్యార్థులు హాజరయ్యా రన్నారు. జగ్గంపాలెం మండల పరిషత్ పాఠశాలో ఒక ఉపాధ్యాయునికి 22 మంది విద్యార్థులకు గాను 20 మంది హాజరు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరును ప్రతిరోజూ ల్ ఈ పి యాప్లో నమోదు చేయాలని సూచించారు. 5వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు విద్యార్థులు తరగతి స్థాయికి తగిన విధంగా ఉన్నారని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పిల్లలందరికీ అందించడం జరిగిందన్నారు.

ప్రస్తుతం వర్షాకాలం కావున పాఠశాల పరిసరాలు, వంటశాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకారంగా ప్రతిరోజూ భోజనం పెట్టాలని ప్రధానోపాధ్యా యులను ఆదేశించారు. అలాగే పాఠశాల పరిధిలో బడి బయట పిల్లలు ఎవరూ ఉండకూడదని, 100% నమోదు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular