ePaper
Sunday, April 5, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంవిద్యుత్ ఘాతకానికి నాలుగు ఇల్లు దగ్ధం..

విద్యుత్ ఘాతకానికి నాలుగు ఇల్లు దగ్ధం..

 

అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 05;అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా, సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈస్టర్ పండుగ కావడంతో బాధితులందరూ గ్రామ సమీపంలో సామూహిక వంటలు చేసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, నిత్యావసరాలు, సామాగ్రి కాలి బూడిదయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు శ్రమించగా, రంపచోడవరం ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో డోలపల్లి. మారతమ్మ, చెవ్వేటి. పుష్పరత్నం, కొమ్ముకురి. సూర్యకాంతం, మరియు దూలపల్లి. లాజరులకు చెందిన ఇళ్లు పూర్తిగా ధ్వంసమై బాధితులు వీధిన పడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular