Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిధర్మ ప్రచార మండలిలో నర్సీపట్నం నుండి ఇద్దరికీ అవకాశం

ధర్మ ప్రచార మండలిలో నర్సీపట్నం నుండి ఇద్దరికీ అవకాశం

నర్సీపట్నం, పెన్ పవర్ :

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ పరిషత్ ధర్మ ప్రచారమండలి సభ్యురాలిగా నర్సీపట్నంకు చెందిన బొడ్డేడ వాసవి నియమించబడ్డారు. ఈ మేరకు టీటీడీ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెరుగుపరిచేందుకు పది జిల్లాలకు టీటీడీ, హిందూ ధర్మ పరిషత్ వారు కమిటీలను ప్రకటించారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సీపట్నం నుండి బొడ్డేడ వాసవి, పి. అరవింద్ కుమార్ ఎంపికయ్యారు. ఈ ప్రాంతంలో ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, హిందూ ధర్మ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన హిందూ ధర్మ పరిషత్ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular