ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంస్వర్ణ లక్కొండ లో అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీలు

స్వర్ణ లక్కొండ లో అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీలు

గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 7:

మండలంలోని స్వర్ణ లక్కొండ గ్రామంలో డిప్యూటీ ఎంపీడీవో గోపన్న దొర ఆకస్మికంగా పర్యటించి సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పైపులైన్ లీకేజీలు, ట్యాంక్ లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లకు ఆదేశించారు.

  • అలాగే సచివాలయ భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన ఆయన, పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడి సిబ్బంది మరింత కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ తేజ దుర్గ, స్వర్ణ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది పి. రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular