మావిగన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్న వేళ, దీని వెనుక ఉన్న విజన్‌పై చర్చ మొదలైంది. నోయిడా మాదిరిగానే ప్రాంతాల సమీకరణతో కొత్త ఆర్థిక శక్తికేంద్రం సృష్టించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు కొత్తగా ఉండొచ్చు కానీ లక్ష్యం మాత్రం ఉపాధి, పరిశ్రమలు, మౌలిక వసతుల విస్తరణ. విజయవాడ–గుంటూరు–మచిలీపట్నం బెల్ట్‌ను అర్బన్ ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దే ఆలోచనకే “మావిగన్” ప్రతీకగా మారింది. సరైన ప్రణాళికతో ఇది ఆంధ్రప్రదేశ్‌కు దీర్ఘకాలిక ఆర్థిక బలంగా మారే అవకాశం ఉందనే చర్చ పెరుగుతోంది.
నోయిడా మోడల్ నుంచి మావిగన్‌కు ప్రేరణ
పేరు కాదు, అభివృద్ధి విజన్ ముఖ్యం
మూడు నగరాల బలం – ఒకే ఆర్థిక హబ్
పోర్ట్, రైలు, రోడ్డు కనెక్టివిటీ ప్రధాన బలం
యువతకు ఉపాధి – రాష్ట్రానికి ఆదాయ వనరు
నోయిడా మోడల్లో మావిగన్ ఆర్థిక భవిష్యత్
మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు: మావిగన్గా మారితే ఏపీకి కొత్త గ్రోత్ ఇంజిన్
స్టేట్ పోలిటికల్ బ్యూరో పెన్ పవర్, ఏప్రిల్ 09 :
సోషల్ మీడియాలో “మావిగన్” అనే పదంపై ట్రోల్స్ కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక ఉన్న అభివృద్ధి ఆలోచనపై ఇప్పుడు సీరియస్ చర్చ మొదలైంది. దేశంలోనే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన Noida నగరం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. 1976లో 81 గ్రామాలను సమీకరించి New Okhla Industrial Development Authorityగా నోయిడాను ఏర్పాటు చేశారు. అప్పట్లో పేరు మీద విమర్శలు వచ్చినా, నేడు అది దేశంలోని ప్రధాన ఐటీ, మీడియా, పారిశ్రామిక హబ్‌గా ఎదిగింది. అదే తరహాలో మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఒక సమగ్ర అర్బన్–ఇండస్ట్రియల్ జోన్‌గా అభివృద్ధి చేయాలన్న ఆలోచనకే “మావిగన్” ప్రతీకగా చెప్పవచ్చు. ఇది కేవలం పేరుకే పరిమితం కాకుండా, సముద్ర పోర్ట్, జాతీయ రహదారులు, భారీ రైల్వే జంక్షన్లు, విమానాశ్రయ కనెక్టివిటీ వంటి బలాలతో పెద్ద ఎకానమీ జోన్‌గా మారే సామర్థ్యం కలిగి ఉంది.విజయవాడ–గుంటూరు ఇప్పటికే వాణిజ్య, విద్యా, రవాణా కేంద్రాలుగా నిలుస్తుండగా, మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కలిస్తే ఈ బెల్ట్‌కు అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు మరింత పెరుగుతాయి. పరిశ్రమలు, లాజిస్టిక్స్ పార్కులు, ఐటీ క్యాంపసులు, గిడ్డంగులు, వాణిజ్య సముదాయాలు ఏర్పడితే స్థానిక యువతకు భారీ ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చు. అభివృద్ధి అనేది కేవలం భవనాలు కాదు, ఒక దీర్ఘకాలిక విజన్. నోయిడా పేరు ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్నా, నేడు దేశ ఆర్థిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే విధంగా మావిగన్ ప్రతిపాదనను కూడా ప్రాంతీయ ఆర్థిక శక్తి కేంద్రంగా చూడాలని అభివృద్ధి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

