ePaper
Tuesday, April 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుసంక్షోభాలను సంకల్పాలుగా మార్చుకున్న నాయకుడు చంద్రబాబు

సంక్షోభాలను సంకల్పాలుగా మార్చుకున్న నాయకుడు చంద్రబాబు

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:సంక్షోభాలను సంకల్పాలుగా మార్చుకుంటూ ముందుకు సాగే దిశాలోచన గల నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.వి. ప్రసాద్ అన్నారు. జీకే వీధి మండలం రింతాడలో నిర్వహించిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, కొందరు చరిత్రను చదువుతారని, మరికొందరు చరిత్రను రాస్తారని, అయితే చంద్రబాబు నాయుడు చరిత్రను సృష్టించే నాయకుడని అన్నారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా, తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్న ప్రతిసారి తన దార్శనికతతో వెలుగునిచ్చే నాయకుడిగా చంద్రబాబు నిలిచారని కొనియాడారు. అనంతరం జీకే వీధి మండల నాయకుల ఆధ్వర్యంలో ఎం.వి.వి. ప్రసాద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు, పిఎసిఎస్ చైర్మన్ మొట్టడం నూకరాజు, సంకాడ గ్రామ కమిటీ అధ్యక్షుడు దేశగిరి గోవిందరావు, మండల కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.వి.వి. ప్రసాద్, యువత అధ్యక్షుడు ముర్ల కోటేశ్వరరావు, వైస్ అధ్యక్షుడు దేశగిరి గంగాధర్, పేసా ఉపాధ్యక్షుడు కంకిపాడు గిరిబాబు, పెదవలస గ్రామ కమిటీ అధ్యక్షుడు నూకరాజు, యూనిట్ ఇన్‌చార్జ్ మురళి భూపతి, మొట్టడం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular