గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5:
గార్ల మండల కేంద్రంలో ఆరాధ్య దైవాలుగా వెలసిన దండు ముత్యాలమ్మ ఊరు ముత్యాలమ్మ బోనాలఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి అధిక శ్రావణమాసంఅసలేరు కార్తెలో భక్తుల కొంగుబంగారాలుగా విరాజిల్లుతున్న దండు ముత్యాలమ్మ ఊరు ముత్యాలమ్మ దేవాలయాలలో కుమ్మరి సంఘం గౌడ సంఘం చాకలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం బోనాల వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు బోనాల ఉత్సవాలలో భాగంగా తొలుత మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతీ హతిరాం ఉప సర్పంచ్ మహమ్మద్ జరీనా లు హాజరై గౌడ సంఘం కుమ్మరి సంఘం కుల పెద్దల తో కలిసి ఊరేగింపుగా గ్రామంలోని గడి మైసమ్మ గణాచారి బుచ్చమ్మ శీతల పరమేశ్వరి బొడ్రాయి నాభిశిల గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించి నైవేద్యాన్ని నివేదించి మొక్కలు చెల్లించారు ఉదయం నుండి అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు దేవాలయానికి మహిళలు భక్తులు బారులు తీరడంతో దేవాలయం ప్రాంగణం మొత్తం సందడి నెలకొంది కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా అనవాయతిగా ముత్యాలమ్మ తల్లులకు సమర్పించే తొలి ఊరు బోనం కుమ్మరి కులస్తులు ఎత్తుకొని డీజే డప్పుచప్పుళ్ల నడుమ భక్తి పారవశ్యంలో శివసత్తుల పూనకాలు నృత్యాలతో ఉత్సవంగా పట్టణ పురవీధుల గుండా పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ముత్యాలమ్మ దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారెతో పాటుగా నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించారు వర్షాకాలంలో సంభవించే వ్యాధులు ప్రబలకుండా పట్టణ ప్రజలను సుఖశాంతులతో వెలుగొందాలని అమ్మవారిని సర్పంచ్ పార్వతి హతి రామ్ నాయక్ అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పిఎసిఎస్ మాజీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు షేక్ యాకుబ్ పాషా మహమ్మద్ రహీమ్ ఖాన్ వార్డు సభ్యులు పూర్ణచందర్ సాయి నీలమ్మ దీపిక ఇమ్రాన్ శ్రీలక్ష్మి రావూజికుమ్మరి కులస్తులు రవీందర్ నాగేశ్వరరావు మల్లయ్య కుమారస్వామి హరి మల్లేష్ రామారావు మహేష్ తాళ్లూరి కొండలరావు లక్ష్మీ లాలమ్మ నాగమ్మ గౌడ కులస్తులు ఈశ్వర్ లింగం తోడేటి శ్రీనివాస్ తాళ్ల పెళ్లి కృష్ణ మండ రవి తోడేటి విజయ రాముడు దుర్గా రాము సతీష్ మహేష్ కత్తి శివ కొత్త కొండ కుమార్ తోడేటి కోటేష్ రాజు రాజేష్ భక్తులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

