ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిశిక్షణ ఇచ్చారు... లబ్ది మరిచారు 140 మంది ఎదురుచూపు

శిక్షణ ఇచ్చారు… లబ్ది మరిచారు 140 మంది ఎదురుచూపు

📰 Generate e-Paper Clip

సీతానగరం, పెన్ పవర్, మార్చి 26:

మహిళలు స్వయం ఉపాధి పొందేలా మూడు నెలల పాటు కుట్టు శిక్షణ ఇచ్చినా.. ఆ తరువాత కల్పించాల్సిన లబ్ధి అందకపోవడంతో వందలాదిమంది నెలలుగా నిరీక్షిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలు స్వయం ఉపాధి పొందితే ఆర్థికంగా వృద్ధి చెందాలని కూటమి ప్రభుత్వం ఆశయం నీరుగారుతోంది. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక బ్యాచ్ ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు వరకు మరో బ్యాచ్ చోప్పున రెండు విడతలుగా శిక్షణ కొనసాగించారు. కేవలం కుట్టు పనులే కాకుండా ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా డిజైనర్ దుస్తులు తయారీ పై నిపుణులతో అవగాహన కల్పించారు. ఆధునిక యంత్రాల పైన సాధన చేయించారు. సీతానగరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ 140 మందికి శిక్షణ వరకు పక్కాగా జరిగిన ఆ తర్వాత అందజేయవలసిన యంత్రాలు ఇప్పటికే ఇవ్వలేదు. ఇంటి వద్ద దుస్తులు కుట్టుకుంటూ ఉపాధి పొందాలన్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. వీళ్ళందరూకి కుట్టు మిషన్లు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular