ఉగాది వేళ వడగళ్ల వాన…

అన్నదాతల మోముల్లో వెల్లివిరిసిన ఆనందం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 19:గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డికొండ, కట్టుపల్లి, బొర్రమామిడి తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానతో పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఉగాది పర్వదినాన అకాల వర్షం కురవడంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వేసవి తాపం నుంచి ఉపశమనం లభించడంతో పాటు తాగునీరు, సాగునీటి అవసరాలకు ఈ వర్షం ఎంతో దోహదపడుతుందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular