ePaper
Thursday, May 7, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న పట్రా రమేష్ బాబు

ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న పట్రా రమేష్ బాబు

📰 Generate e-Paper Clip

చింతూరు పెన్ పవర్, మార్చి 19:

గిరిజన సంప్రదాయ కళలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖ కళాకారుడు కొమ్ముకోయ రమేష్ బాబు కి 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం ప్రదానం చేసింది. ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అందుకోవడం ఆయనకు ప్రత్యేక గౌరవంగా నిలిచింది. సంప్రదాయ గిరిజన కళారూపమైన కొమ్ముకోయ కళను పరిరక్షిస్తూ, విస్తరింపజేస్తూ రమేష్ బాబు చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. చిన్ననాటి నుంచే కళపై ఆసక్తి పెంపొందించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అనేక వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ గిరిజన సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దింస అర్జున్ మాట్లాడుతూ, మన ప్రాంతానికి చెందిన కళాకారుడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణం. యువ కళాకారులకు ఇది స్ఫూర్తిదాయకం అని తెలిపారు. ప్రఖ్యాత గిరిజన కళాకారుడు పట్ర ముత్యం వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆయన స్థాపించిన కొమ్ముకోయ నృత్య సంప్రదాయాన్ని రమేష్ బాబు ముందుకు తీసుకెళ్తున్నారు. స్థానిక ప్రజలు, కళాకారులు, ప్రజా ప్రతినిధులు పట్రా రమేష్ బాబు కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular