Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఅర్హులందరికీ గృహాలు మంజూరయ్యేలా కృషి చేయాలి:టీడీపీ మండల అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు

అర్హులందరికీ గృహాలు మంజూరయ్యేలా కృషి చేయాలి:టీడీపీ మండల అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 14:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద గృహ నిర్మాణాల కోసం నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు తెలిపారు.ఈ సందర్భంగా గృహ నిర్మాణాల కోసం సర్వే చేయించుకున్న లబ్ధిదారుల డేటాను ఆయన స్వయంగా గృహ నిర్మాణ శాఖ కార్యాలయానికి వెళ్లి అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు అయ్యేలా అధికారులు కృషి చేయాలని, మంజూరు ప్రక్రియలో నిర్లక్ష్యం చేయరాదని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొట్టడం వి.వి. ప్రసాద్, క్లస్టర్ ఇన్‌చార్జ్ వడేల పాండురాజు, యూనిట్ ఇన్‌చార్జ్ ముర్ల భూపతి, గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్లు సెగ్గే సూరిబాబు, పసుపులేటి చిట్టిపడాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular