Homeతెలంగాణముత్యాలమ్మ బోనాల పండుగను విజయవంతం చేయాలి

ముత్యాలమ్మ బోనాల పండుగను విజయవంతం చేయాలి

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 3:

ఈ నెల 5వ తేదీన జరగనున్న ముత్యాలమ్మ బోనాల పండుగను గ్రామ ప్రజలందరు సహకారంతో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని గౌడ సంఘం కుమ్మరి సంఘం కులస్తులు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక గార్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం కుమ్మరి సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహణ కొరకు సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామ సంప్రదాయాలకు అనుగుణంగా బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని నిర్ణయించారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ నిర్వహణకు గ్రామ ప్రజలంతా సహకరించాలని గ్రామంలో ప్రతి కుటుంబం బోనాల పండుగలో పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు పొంది కృపకు పాత్రులు కావాలని గ్రామ ప్రజల ఐక్యతకు ప్రత్యేకంగా నిర్వహించే ముత్యాలమ్మ బోనాల పండుగను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి, హతిరాం నాయక్, కుమ్మరి సంఘం, గౌడ సంఘం కులస్తులు తాళ్లూరి రవీందర్, అలవాల క్రాంతి, ఏదునూరి కుమారస్వామి, మహేష్, నాగేశ్వరరావు, శ్రీకాంత్, కోండల్ శ్రీనివాస్, వీరన్న, కందునూరి ఈశ్వర్ లింగం, కందునూరి శ్రీనివాస్, తాళ్లపెల్లి కృష్ణ, తోడేటి నాగరాజు, కత్తి వెంకన్న, కొత్తకొండ కుమార్, తోడేటి శ్రీనివాస్, కత్తి శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular