Homeఆంధ్రప్రదేశ్పోలవరం జిల్లాలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

పోలవరం జిల్లాలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

పరిపాలనలో కీలక మార్పులు

రంపచోడవరం, ఏప్రిల్ 18 (పెన్ పవర్):
రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో పోలవరం జిల్లాలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. విజయవాడలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సూరపాటి ప్రశాంత్ కుమార్‌ను పోలవరం జిల్లాకు జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా ఆయనకు రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాటు, సబ్ కలెక్టర్ బాధ్యతలను కూడా ఇన్‌చార్జ్‌గా నిర్వహించాల్సిందిగా పేర్కొంది.ఇప్పటివరకు రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న బచ్చు సమరణ్ రాజ్‌ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇక రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా ఉన్న శుభం నోఖ్వాల్‌ను చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేస్తూ, అక్కడ సబ్ కలెక్టర్ బాధ్యతలను కూడా అదనంగా నిర్వహించాల్సిందిగా సూచించింది.ఈ మార్పులతో పోలవరం జిల్లాలో పరిపాలనా వ్యవస్థలో ముఖ్యమైన పునర్వ్యవస్థీకరణ జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular