- గూడెంకొత్తవీధి, పెన్ పవర్, ఆగస్టు 22: స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ పరిధిలోని రింతాడ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎంపీడీవో బీహెచ్‌వీ రమణబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.మండల ఎంపీపీ బోయిన కుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ మొట్టడం శరభన్నదొర, మాజీ వైస్ సర్పంచ్ ఎం. సోమేశ్‌కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు సీహెచ్. సంజీవరావు, కే. గిరిప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షుడు కే. నారాయణ తదితరులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమిత్ర, డిప్యూటీ ఎంపీడీవో జగదీష్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో సీహెచ్. రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనం పెంపే లక్ష్యం.. రింతాడలో మొక్కలు నాటిన నాయకులు
RELATED ARTICLES

