Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజురేపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన:ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు 

రేపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన:ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు 

  • గూడెంకొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 23: పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన కార్యక్రమాన్ని ఆదివారం అన్ని పంచాయతీ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు గూడెంకొత్తవీధి ఎంపీడీవో బీహెచ్‌వీ రమణబాబు తెలిపారు.పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో సంబంధిత సచివాలయాల్లో పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా పంచాయతీల పరిధిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ముసాయిదా జాబితాపై ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతరులు తమ అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఈ నెల 26వ తేదీలోపు ఎంపీడీవోకు తెలియజేయాలని సూచించారు.ప్రజల నుంచి అందే అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. కాబట్టి ముసాయిదా ప్రకటన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు, పెద్దలు పాల్గొని పోలింగ్ కేంద్రాలపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular