ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడజిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను కలిసిన ఐఎంఏ ప్రతినిధులు

జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను కలిసిన ఐఎంఏ ప్రతినిధులు

📰 Generate e-Paper Clip

ప్రజారోగ్య కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ

కాకినాడ పెన్ పవర్,మే14: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కాకినాడ ప్రతినిధులు గురువారం సాయంత్రం నూతన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఐఎంఏ కాకినాడ అధ్యక్షులు డా. కాద వెంకటరమణ,కార్యదర్శి డా. ఎస్.సి.హెచ్.ఎస్. రామకృష్ణ కలెక్టర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో ఐఎంఏ కాకినాడ గత అధ్యక్షులు డా. మోకా పవన్ కుమార్, డా. కృష్ణవేణి, డా. ప్రశోభ్ కుమార్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.జిల్లాలో ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య సేవల అభివృద్ధి, అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు,పాఠశాల స్థాయిలో సీపీఆర్ శిక్షణ,ఆరోగ్య శిబిరాల నిర్వహణ వంటి అంశాలలో జిల్లా పరిపాలనకు ఐఎంఏ కాకినాడ సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రతినిధులు కలెక్టర్‌కు హామీ ఇచ్చారు.అదే విధంగా ప్రజారోగ్య కార్యక్రమాల విజయవంతమైన అమలులో వైద్య వర్గాల భాగస్వామ్యం కీలకమని, వైద్యుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular