ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంటైర్ బ్లాస్ట్‌తో మినీ బస్ బోల్తా

టైర్ బ్లాస్ట్‌తో మినీ బస్ బోల్తా

📰 Generate e-Paper Clip

తులసిపాక ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.

చింతూరు, పెన్ పవర్ మే 29:

తులసిపాక ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో మినీ బస్ అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు, కాకినాడ జిల్లా కోరంగి ప్రాంతం నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం భక్తులు మినీ బస్సులో బయలుదేరినట్లు తెలిసింది. బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారందరికీ ప్రస్తుతం ప్రాణాపాయం లేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అడవులు, ప్రమాదకర ఘాట్ రోడ్డు ప్రాంతం కావడంతో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular