Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువీరవరం గ్రామ తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీడీఓకు వినతిపత్రం

వీరవరం గ్రామ తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీడీఓకు వినతిపత్రం

📰 Generate e-Paper Clip

జీకే వీధి మండలంలోని వంచుల గ్రామ పంచాయతీ పరిధిలోని వీరవరం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కూటమి నాయకులు ఎంపీడీఓ గారికి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు, వృద్ధులు, చిన్నారులు కష్టాలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. గ్రామంలో శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పొత్తూరు కొండలరావు, ముక్కాలి మహేష్, కాకూరి శేఖర్, బత్తుల సిద్ధార్థ్ మార్క్, పాండురాజు, వనపల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular