Homeఆంధ్రప్రదేశ్పోలవరంమహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ

మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ

 

 

గంగవరం, జూన్ 13 (పెన్ పవర్): పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు అడ్డతీగల సీఐ గజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో శనివారం పాత గంగవరం అంబేద్కర్ సెంటర్ నుంచి వారపు సంత వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్-గంజాయి దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular