Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుసమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి:డీఆర్‌వోకు వినతిపత్రం.. 

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి:డీఆర్‌వోకు వినతిపత్రం.. 

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 30:ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో గురువారం డిమాండ్ చేశారు.రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పాడేరు ఐటీడీఏ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్‌వోకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్షలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలు, ఐఈఆర్‌పీలు, కేజీబీవీ టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది, మెసెంజర్లు తదితర విభాగాల్లో గత 17 సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత లభించడం లేదన్నారు.సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, అస్సాం తదితర రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసినట్లు పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను వినిపించారు. పెండింగ్‌లో ఉన్న జూన్, జూలై-2026 వేతనాల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు మినిమమ్ ఆఫ్ టైమ్ స్కేల్, హెచ్‌ఆర్‌ఏ, డీఏ అమలు చేసి వేతనాలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎం. అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి వి. జయరాజు, ఉపాధ్యక్షులు పి. పంతులు, బాలరాజు, మిత్యరాజు, ఉపేంద్ర, కోటి తదితర నాయకులతో పాటు సుమారు 300 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular