ఖమ్మం, పెన్ పవర్, జూలై 30:
ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ముత్తగూడెం గ్రామానికి ఇటీవల మేకల నాగేశ్వరరావు (38) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండటంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.మేకల నాగేశ్వరరావు ఎం. వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. తమ బాల్య మిత్రుడు అకాల మరణం చెందాడన్న విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు, స్నేహితులు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మిత్రులు అందరూ కలిసి రూ.27 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించి గురువారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టసమయంలో స్నేహితులు అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్తులు, మహిళలు పేర్కొన్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి అవసరమైనప్పుడు తమ సహకారం కొనసాగుతుందని స్నేహితులు తెలిపారు. స్నేహబంధం అంటే ఇదేనని, ఆపదలో తోడుగా నిలవడమే నిజమైన మానవత్వమని పలువురు కొనియాడారు. శీలం సుధాకర్, బేతంపూడి నానయ్య, పోతర్ల సతీష్, దరిపల్లి అప్పారావు, మంకేన ఉమాపతి, కామల్ల వెంకట్, గుదే యల్లయ్య, వడ్లమూడి రాంబాబు, వేముల పాపారావు, సామల విజయ్, పిల్లల మర్రి వెంకటేశ్వర్లు, నండ్ర మధు కృష్ణ,రెంటాల నాగేశ్వరరావు, పాపిట్ల సంజీవరావు, తద్దె వెంకటనారాయణ, దేవరశెట్టి రామారావు, రెంటాల సతీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

