ఖమ్మం, పెన్ పవర్, జూలై 28:
ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు హెచ్ ఎన్ బజార్ కు చెందిన రంగిశెట్టి ఉదయ్ కృష్ణ కుమార్తె రంగిశెట్టి వైదిక ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఉదయ్ కృష్ణ స్వగృహానికి వెళ్లి చిన్నారి వైదిక పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి బాధిత కుటుంబ సభ్యుల్ని ఓదార్చి మనోధైర్యంగా ఉండాలని తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి రవి కళ్లెం శేశిరెడ్డి వెంపటి వెంకన్న కేసిరెడ్డి సురేష్ రెడ్డి భద్రాచారి తదితరులు పాల్గొన్నారు.

