Homeతెలంగాణఖమ్మంచిన్నారి వైదిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

చిన్నారి వైదిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం , పెన్ పవర్, ఆగస్టు 27:

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు హెచ్‌ఎన్‌ బజార్‌కు చెందిన రంగిశెట్టి ఉదయ్‌ శ్రావణి దంపతుల కుమార్తె చిన్నారి వైదిక ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. చిన్నారి మృతి విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం రాత్రి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా చిన్నారి వైదిక మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. వైదిక మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular