Homeతెలంగాణఅంగరంగ వైభవంగా ముత్యాలమ్మ బోనాలు

అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ బోనాలు

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 26:

ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ నగర్ బజార్ వాసులు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించుకుని బోనాలను నెత్తిన ఎత్తుకుని మేళతాళాలు, డప్పుచప్పుళ్ల మధ్య గార్ల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా పౌర సరఫరాల గిడ్డంగి గోదాం వద్ద ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పార్వతి హథిరామ్ నాయక్ దంపతులు అమ్మవారికి సారే సమర్పించి మొక్కులు చెల్లించారు గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రార్థించారు.బోనాల వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. డప్పుచప్పుళ్లు, మేళతాళాలు, భక్తుల సందడి మధ్య అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించడంతో ముత్యాలమ్మ దేవాలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.ప్రతి ఏడాది నిర్వహించే ముత్యాలమ్మ బోనాలను అంబేద్కర్ నగర్ బజారు వాసులు ఐక్యంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో6వ వార్డు సభ్యులు సలగం నీలమ్మ 7వ వార్డు సభ్యులు అజ్మీర రాంబాబు కుసుమూరి పూర్ణచందర్ గులగట్టు లెనిన్ కందుల బుచ్చయ్య వేర్పుల వీరస్వామి మద్దెల నరేష్ అక్కి స్వామి కందుల సత్యనారాయణ మేడిపల్లి నాగరాజు పురుషోత్తం బిక్షపతి గాజుల రాము సలగం వినోద్ మేడిపల్లి యుగంధర్ మహేశ్వరి జానీ మహిళలు యువతి యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular