Homeతెలంగాణప్రజా చైతన్యమే కర్తవ్యంగా యువ కళాకారులు ముందుకు రావాలి

ప్రజా చైతన్యమే కర్తవ్యంగా యువ కళాకారులు ముందుకు రావాలి

 

గార్ల, పెన్ పవర్, జూలై 29:

ప్రజల హక్కులు, జీవనోపాధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తూ ప్రజా చైతన్యమే కళాకారుల ప్రథమ కర్తవ్యం గా యువ కళాకారులు ముందుకు రావాలని ఉమ్మడి రాష్ట్ర ప్రముఖ గాయకుడు ఏ జగన్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంగఘం భవనం లో జరుగుతున్న ప్రజానాట్యమండలి రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు 2 వ రోజు బుధవారం ఉత్సాహభరితంగా సాగియి. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కళ ప్రజల జీవితాల నుంచి పుట్టి, తిరిగి ప్రజలకే ఉపయోగపడాలని, కళాకారుడు సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు.నేటి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, ఉపాధి వంటి సమస్యలను కళాకారులు లోతుగా అధ్యయనం చేసి, తమ పాటలు, ఆటలు కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు.ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న పాలకుల వైఫల్యాలను ధైర్యంగా ఎండగట్టడం ప్రజా కళాకారుల బాధ్యత అని, కళ ప్రజల గొంతుకగా మారి, అన్యాయాలను ప్రశ్నించే శక్తిగా నిలవాలని అన్నారు.ప్రజా సంస్కృతిని పరిరక్షిస్తూ, అభ్యుదయ విలువలను విస్తృతంగా వ్యాప్తి చేసే సాంస్కృతిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించేందుకు యువ కళాకారులకు ఈ రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు కళాకారుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించి, ప్రజా చైతన్యానికి దోహదపడే సృజనాత్మక వేదికగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఎంజే వినోద్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, జిల్లా కార్యదర్శి నక్క సైదులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల ఆనంద్, కాకం ఆంజనేయులు, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు కొండూరు భాస్కర్,కుమ్మరి శంకర్,రాష్ట్ర నాయకులు ముత్యాలు,మేడి అంజమ్మ, హరిత, జిల్లా అధ్యక్షులు అలవాల రామకృష్ణ,మండల నాయకులు సిహెచ్ ఎల్లయ్య, వెంకన్న, ఎస్ నాగరాజు, డప్పు శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular