గార్ల, పెన్ పవర్, జూలై 29:
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకొని భక్తి మార్గంలో నడవాలని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ అన్నారు. గురు పూర్ణిమ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు గురువులు చెప్పిన మాటలు విని సన్మార్గంలో నడవాలని గురు పూర్ణిమ విశిష్టతను తెలియజేశారు. గురు పూర్ణిమ వేడుకలకు సాయిబాబా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సాయిబాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడంతో పాటుగా అఖండ సాయినామస్మరణతో ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగింది.ఈ కార్యక్రమంలో మండరాముగౌడ్ రమేష్ బాబు హతీరాం సుదర్శన్ కవిత ఉమారాణి శ్రీనివాస్ కవిత శ్రీనివాస్ గుప్తా రజనీ తదితరులు పాల్గొన్నారు.

