Homeతెలంగాణవరంగల్రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

గార్ల పెన్ పవర్, జులై 23:

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, స్వల్పకాలిక పంటల వైపు దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారుగార్ల మండల పరిధిలోని పుల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం లో గురువారం సర్పంచ్ బాబురావు అధ్యక్షతన ప్రత్యామ్నాయ పంట మార్పిడి పై అవగాహన సదస్సు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించి సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినోప్రభావం వలన జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదు అయిందని రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పంట మార్పిడి చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించ వచ్చునని సేంద్రియ పద్ధతులు జీవన ఎరువులను విరివిగా వినియోగించడం ద్వారా బూసారాన్ని మెరుగు పరచాలని మితిమీరిన రసాయనాలు వినియోగించడం వలన నేల చౌడు బారి సూక్ష్మ దాతు లోపాలు ఏర్పడి నేల పంటలకు ప్రతికూలంగా తయారు అవుతుందని నేలలో పంటలకు ఉపయోగపడే సేంద్రియ కార్బనం నశిస్తుందని రైతులు సేంద్రియ ఎరువులు పశువుల పెంట విరివిగా వినియోగించాలని భూమిలో బాస్వరం నిల్వలు అధికంగా ఉన్నాయని వాటిని కరిగించి మొక్కకు బాస్వరం లభ్యమయ్యేలా పాస్పో బాక్టీరియా ను ప్రతి రైతు వాడాలని పచ్చి రొట్ట ను పూత దశలో భూమిలో కలియ దున్ని ఆఖరి దుక్కిలో 20 కేజీ ల జింక్ సల్ఫేట్ ను వేయడం ద్వారా జింక్ లోపాన్ని నివారించ వచ్చునని కాంప్లెక్స్ ఎరువులను మితంగా వాడాలని సూచించారు. వర్షబావ పరిస్థితి వలన నీటి లభ్యత తక్కువగా ఉండటం వలన పప్పు దాన్యాలు చిరుదాన్యాలు కూరగాయలు సాగు చేపట్టాలని మరిన్ని యాజమాన్య పద్ధతుల కొరకు మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని
కోరారు. ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ ఏఈ భరత్ ఏ ఈ ఓ పూజిత పంచాయతీ సెక్రటరీ రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular