భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31: రేపు జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ నగరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు సమాచారం.

