Homeఆంధ్రప్రదేశ్విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు వినతి

విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు వినతి

మాచ్‌ఖండ్ పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదంతో జోలపుట్టులో విద్యుత్ కష్టాలు

ఏపీఈపీడీసీఎల్ ద్వారా విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

ముంచంగిపుట్టు, జూలై 31 (పెన్ పవర్):అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలంలోని జోలపుట్టు పంచాయతీ కేంద్రానికి ఏపీఈపీడీసీఎల్ ద్వారా విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు వైఎస్సార్‌సీపీ అల్లూరి జిల్లా జేఎస్ఎస్ కోఆర్డినేటర్ అరబీరు జగబంధు తెలిపారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ, మే 23న మాచ్‌ఖండ్ పవర్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో ప్లాంట్ మూతపడటంతో జోలపుట్టు గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు.ఈ సమస్యను ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర దృష్టికి తీసుకెళ్లగా, ఆమె జిల్లా కలెక్టర్‌తో పాటు మాచ్‌ఖండ్ ఏపీ జెన్‌కో ఎస్‌ఈతో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం జూన్ 6న ఏపీ జెన్‌కో అధికారులు ఏపీఈపీడీసీఎల్‌కు అనుమతి పత్రం జారీ చేశారని చెప్పారు.ఆ అనుమతి పత్రంతో జూన్ నెలలో పాడేరు పీజీఆర్‌ఎస్‌, అలాగే జూన్ 10న ముంచంగిపుట్ట గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అనంతరం జూన్ 12న పెదబయలు విద్యుత్ శాఖ అధికారులు గ్రామాన్ని పరిశీలించి, గ్రామస్థుల ఆధార్ కార్డుల ప్రతులు సేకరించినప్పటికీ ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.జోలపుట్టు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి, ఏపీఈపీడీసీఎల్ ద్వారా విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జోలపుట్టు మాజీ సర్పంచ్ దొర నీలకంఠం, ఎండీ సులేమాన్, శ్యామో, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular