గంగవరం, జూలై 17 (పెన్ పవర్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రత, క్రమశిక్షణ, ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వై. రాఘవరెడ్డి సూచించారు. గంగవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆయన మౌలిక వసతులు, బోధన, హాజరు నమోదులు, విద్యా పర్యవేక్షణ వ్యవస్థ అమలును పరిశీలించారు. పాఠశాలకు దూరమైన విద్యార్థులను తిరిగి చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి విద్యా ప్రమాణాలు పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ మల్లేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి ఉన్నారు.

