Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంమెగా పీటీఎం 4.0లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.. పాఠశాలకు అదనపు తరగతి గదుల ఏర్పాటుకు...

మెగా పీటీఎం 4.0లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.. పాఠశాలకు అదనపు తరగతి గదుల ఏర్పాటుకు హామీ

 

మెగా పీటీఎం 4.0లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.. పాఠశాలకు అదనపు తరగతి గదుల ఏర్పాటుకు హామీ

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్             విశాఖపట్నం, జూలై 24 :
పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు పెదనరవ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 (తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం) కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన పాఠశాల, వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలకు అదనపు తరగతి గదులు అవసరమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేయగా, కొత్త భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే స్థానిక పారిశ్రామికవేత్తల సహకారంతో పాఠశాలలో అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరిగిందని, ‘షైనింగ్ స్టార్’ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విశాఖకు కొత్త పరిశ్రమలను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో సరఫరా చేసిన ట్రాక్‌సూట్లు, షూస్, దుప్పట్లు తదితర వస్తువులను విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రూప, ఏపీఐసీ జోనల్ అధికారి సింహాచలం నాయుడు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ శంకర్రావు, ఎంఈఓలు సువర్ణ, మధుమూర్తి, మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular