Homeఆంధ్రప్రదేశ్తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించిన ఏకలవ్య పాఠశాల

తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించిన ఏకలవ్య పాఠశాల

క్రమశిక్షణే విద్యార్థుల విజయానికి పునాది – అతిథులు

టాపర్లకు సన్మానం.. పాఠశాల అభివృద్ధికి రూ.50 వేల విరాళం

  1. చింతపల్లి, పెన్ పవర్, జూలై 24:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్’ కార్యక్రమం శుక్రవారం చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా జరిగింది. పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషా దేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఏఎంసీ చైర్మన్ కిల్లో ఊర్మిళ, టీడీపీ మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు, ఎంపీటీసీ దాసరి పద్మ, మండల విద్యాశాఖ అధికారి వి.వి. ప్రసాద్, ఆర్వీ నగర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సాహిత్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రామారావు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.ఇటీవల పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన పాఠశాల టాపర్లు భానుకృష్ణ, పాంగి తన్వితలను అతిథులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.మండల విద్యాశాఖ అధికారి వి.వి. ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను ఆధారంగా చేసుకుని స్ట్రీమ్, మౌంటైన్, షైనింగ్ స్టార్స్ విభాగాలుగా వర్గీకరించి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. చింతపల్లిలో ఏర్పాటు చేసిన కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత నీట్ కోచింగ్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.జడ్పీటీసీ పోతురాజు బాలయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో రాజకీయాలు, యూనియన్ల జోక్యానికి తావులేకుండా విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు.ఎంపీపీ కోరాబు అనూషా దేవి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సీబీఎస్ఈ సిలబస్‌తో గిరిజన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందడం అదృష్టకరమన్నారు.టీడీపీ మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు మాట్లాడుతూ చింతపల్లి నీట్ కోచింగ్ కేంద్రానికి గుజరాత్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు రావడం గర్వకారణమన్నారు.సెలవుల సమయంలో పిల్లలు మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు.ఆర్వీ నగర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సాహిత్య సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,14 ఏళ్లు నిండిన బాలికలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని కోరారు.పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం,సౌర విద్యుత్ వినియోగంతో ‘నెట్ జీరో క్యాంపస్’ లక్ష్యాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి లోతుగడ్డ మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు చింతర్ల సునీల్ కుమార్ రూ.50 వేల నగదు విరాళంగా అందజేశారు. అలాగే సమీపంలోని ఊట నుంచి గ్రావిటీ విధానంలో నీటిని సరఫరా చేసే ప్రణాళికను పరిశీలించినట్లు, తాత్కాలిక గ్రావిటీ వాటర్ పథకానికి రూ.13 లక్షలతో జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు నిర్వాహకులు వెల్లడించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular