నెలలు గడుస్తున్నా ఖాతాల్లో జమ కాని నగదు.. లబ్ధిదారుల అవస్థలు
గూడెం కొత్తవీధి, ఆగస్టు 5 (పెన్ పవర్):ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడంపై వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఏప్రిల్, మే నెలల్లో ఉపాధి హామీ పనులు చేసిన లబ్ధిదారులకు ఇప్పటికీ కూలి డబ్బులు అందలేదని తెలిపారు.పనులు చేసిన కూలీలకు సకాలంలో నగదు చెల్లించాల్సి ఉండగా, నెలలు గడుస్తున్నా బకాయిలు విడుదల కాకపోవడంతో పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న సమయంలో ఉపాధి హామీ కూలి డబ్బులు అందితే కుటుంబ అవసరాలతో పాటు వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడతాయని అన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని బొబ్బిలి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కూలీలకు వారి శ్రమకు సంబంధించిన సొమ్ము కోసం నెలల తరబడి ఎదురుచూసే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

