Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజులకవరపుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

లకవరపుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అల్లూరి బాటలో నడిచిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఘన సన్మానం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగస్టు 15: అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంపా విప్లవ పోరాటానికి చారిత్రక నేపథ్యం కలిగిన లక్కవరపుపేట స్వర్ణ పంచాయతీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 1922–1924 మధ్య అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంపా విప్లవ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న లక్కవరపేట గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ కంకిపాటి కొత్తదాసు, తూరుమామిడి గ్రామానికి చెందిన శ్రీ కంకిపాటి కట్టు పడాల్, పెదవలస గ్రామానికి చెందిన శ్రీ కంకిపాటి ఎండు పడాల్‌ల సేవలను స్మరించుకున్నారు. అల్లూరి బాటలో నడిచి బ్రిటిష్ పాలకుల గుండెల్లో భయాందోళనలు సృష్టించిన వారి పోరాట స్ఫూర్తిని వక్తలు కొనియాడారు.స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు, మునిమనుమలు ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొనగా, సచివాలయ సిబ్బంది వారిని ఘనంగా సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా కంకిపాటి రామారావు, మాజీ సర్పంచ్ వీరేంద్రప్రసాద్, యువ నాయకుడు కంకిపాటి లోవ కోటి పడాల్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల ఫలితంగా ప్రజలకు రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛ లభించాయని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular