Homeతెలంగాణపాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి: పన్యాల జైపాల్ రెడ్డి

పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి: పన్యాల జైపాల్ రెడ్డి

ఎల్బీనగర్, పెన్ పవర్, ఆగస్టు 18:

అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న ను స్ఫూర్తిగా తీసుకోవాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఉన్న పాపన్న విగ్రహానికి జైపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన పోరాటయోధులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండ్ పై ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, మంత్రులకు, అధికారులకు గౌడ కులస్తుల తరుపున పన్యాల జైపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో ఉత్సవ కమిటీ సభ్యులు అంబాల మల్లేష్ గౌడ్, పల్లె గణేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి.జానిమియా, నల్లంకి ధనరాజ్ గౌడ్, శ్రీధర్ గౌడ్, జహంగీర్ బాబు గౌడ్, స్వామి గౌడ్, పులి వెంకట్ గౌడ్, వెంకటేష్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, కిషోర్ గౌడ్, రాకేష్ గౌడ్, గౌడ కులస్తులు, నాయకులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular