నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం డివిజన్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని జాతీయ జెండాను ఎగరవేశారు. నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో వి.వి. రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థినులు జాతీయ గీతాలను ఆలపించగా, అధికారులు, సిబ్బంది జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వివి రమణ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం ఈ స్వాతంత్రం అని అన్నారు. వారి త్యాగ ఫలాలను మనం అనుభవించడమే కాకుండా, ఈ స్వతంత్ర భారతావనిని కాపాడుకునే బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎల్ . రామారావు పాల్గొన్నారు

