Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు

నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు

నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు

త్వరలో 100 పడకల ఆసుపత్రిగా మార్పు – హోం మంత్రి వంగలపూడి అనిత

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్న 

అనకాపల్లి /నక్కపల్లి, ఆగస్టు 13: నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

పిల్లల వార్డును సందర్శించిన మంత్రి చిన్నారులను పరామర్శించి బేబీ కిట్లను అందజేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్యులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

నక్కపల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ప్రారంభం

నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు. వాహన సేవలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బాలింత లక్ష్మీ దుర్గుతో కలిసి మంత్రి వాహనంలో ప్రయాణించారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అడ్డురోడ్డు మీదుగా కోనవానిపాలెం వరకు వెళ్లి, బాలింత లక్ష్మీ దుర్గును, ఆమె శిశువును వారి స్వగ్రామానికి సురక్షితంగా చేర్చారు.

ప్రసవానికి ముందు, అనంతరం తల్లులు, నవజాత శిశువులు ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి తెలిపారు. ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడంలో ఈ వాహనాలు కీలకంగా నిలుస్తాయని చెప్పారు.

తల్లులు, చిన్నారుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల సేవలు ఆరోగ్యాంధ్ర దిశగా మరో ముందడుగు అని ఆమె అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular