Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంకొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో ఎమ్మెల్యే పంచకర్ల

కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో ఎమ్మెల్యే పంచకర్ల

 

కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో ఎమ్మెల్యే పంచకర్ల

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 14: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రం విజయోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ సక్సెస్ మీట్‌కు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ మెగా హీరో సినిమా విడుదలైతే తెలుగు ప్రేక్షకులకు పండుగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. కొరియన్ కనకరాజు విజయవంతం కావడం పట్ల మెగా అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సినిమా వరుణ్ తేజ్‌కు మంచి పేరు తీసుకొచ్చిందని, ఆయన మరిన్ని విజయాలు సాధించి సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular