గార్ల, పెన్ పవర్, ఆగస్టు 12:
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు పాపావత్ యాదగిరి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాటం కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా బుధవారం గార్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు పాపావత్ యాదగిరి నాయక్, మాట్లాడుతూ పీఆర్ సిని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అలాగే కేజీబీవీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, ఎంఆర్‌సీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు దశలవారీగా పోరాట కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గార్ల మండల తహసీల్దార్ శారదకు సమర్పించారు. ఈ కార్యక్రమంలోయూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ నాయకులు బాలాజీ నాయక్, మాచర్ల సుందర్ కుమార్, షరీఫ్, జబ్బ వీరస్వామి, కబ్బాకుల వెంకన్న ఉపాధ్యాయులు సంతు, రామనాధం, వెంకట్‌రెడ్డి, రాజశేఖర్, ప్రవీణ్‌కుమార్, తోట రమేష్, బాల్య, కన్నయ్య, వెంకట్రావు, శ్రీను, అనిల్, కిరణ్, పార్వతి, విజయ, సీతారాములు, రవీందర్ ప్రసాద్, లోకేష్, భావ్‌సింగ్, రమేష్, మధు, లచ్చిరాం, ప్రసాద్, కిషన్, రవీందర్, శోభన్‌బాబు, వజ్రం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

