వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
విశాఖపట్నం: వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు. 34వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ దక్షిణ వాలంటరీ విభాగం అధ్యక్షురాలు కడవల నాగమణి తండ్రి దొడ్డి పైడిరాజు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు.
వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి ద్వారా విషయం తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ స్వయంగా మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంటి పెద్దను కోల్పోవడం తీరని లోటని, ఆ లోటును ఎవరూ పూడ్చలేరని అన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. తండ్రి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రజలకు సేవ చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని, మానవసేవే మాధవసేవ అనే మదర్ థెరిసా ఆశయాలు తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు, తన వెంట నడిచే పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి, స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ లండ రమణ, జిల్లా స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్, వార్డు మహిళా అధ్యక్షురాలు సీహెచ్ జ్యోతి, వార్డు బీసీ సెల్ అధ్యక్షుడు అంబటి అప్పలరాజు, 43వ బూత్ అధ్యక్షురాలు కారి దానియమ్మ, వార్డు క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు పోటీల అప్పారావు, వార్డు మైనారిటీ అధ్యక్షురాలు షేక్ ఆశ, జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ చోడిపిల్లి శివ, సౌత్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకుల శ్యామ్, చేపల రాజు తదితర 34వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

